TSPSC Group-1 Prelim Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించండి, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థంచిన తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

High Court of Telangana | (Photo-ANI)

తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దు అయ్యింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement