Air Hostess Welcomes ISRO Chief: వీడియో ఇదిగో, ఇండిగో విమానంలో ఇస్రో చీఫ్ సోమనాథ్, ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌తో సత్కరించిన ఇండిగో సిబ్బంది
ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఆనందం అవధులు దాటింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి.
చంద్రయాన్-3 విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా హీరోలు అయ్యారు. ఎక్కడికెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. తాజాగా, ఇస్రో చీఫ్ సోమనాథ్ ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆయన తమ విమానంలో ప్రయాణిస్తుండడాన్ని ఇండిగో వర్గాలు ఆనందం అవధులు దాటింది. విమానం గాల్లోకి లేచే ముందు ప్రత్యేక అనౌన్స్ మెంట్ తో ఆయనను గౌరవించాయి.
ఇవాళ ఈ విమానంలో మనందరితో పాటు ఓ విశిష్ట వ్యక్తి కూడా ఉన్నారు. మీరు (సోమ్ నాథ్) ఈ విమానంలో ఉన్నందుకు ఇండిగో ఎంతో సంతోషిస్తోంది. మీకు సేవలు అందించే అవకాశం లభించడాన్ని మాకు మహాభాగ్యంగా భావిస్తున్నాం. దేశం గర్వించేలా చేసిన మీకు ధన్యవాదాలు" అంటూ గౌరవ వచనాలు పలికారు. ఈ సందర్భంగా విమానం మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగింది. అనంతరం సోమ్ నాథ్ కు ఎయిర్ హోస్టెస్ ఫుడ్ ట్రే ఇస్తూ, ఇండిగో తరఫున ఓ గ్రీటింగ్ కార్డును కూడా అందించింది.
Here's Video