Covid in China: చైనాలో నాలుగు లక్షలకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో 34,980 కొత్త కేసులు నమోదు, ఇప్పటివరకు 5233 మంది మృతి

చైనాలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. గురువారం 36,061 కేసులు నమోదు కాగా తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది.

COVID-19 in China. (Photo Credits: IANS)

చైనాలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. గురువారం 36,061 కేసులు నమోదు కాగా తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇప్పటివరకు చైనా ప్రధాన భూభాగంలో కరోనా బాధితుల సంఖ్య 3,72,964కు చేరింది.కరోనా కేసులు పెరగడంతో బీజింగ్‌, షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement