Donald Trump Arrested: డొనాల్డ్​ ట్రంప్‌ అరెస్ట్, వెంటనే 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదల, తన అరెస్ట్ దేశ చరిత్రలో చీకటి రోజు అని మండిపాటు

’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.

File: Instagram

’అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయన్ని అరెస్ట్ (Arrested) చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదీ ఒకటి.

జైలు అధికారులు ట్రంప్‌కు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు. 77 ఏండ్ల ట్రంప్‌ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ.. ట్రంప్‌ తనని తాను వెనకేసుకొచ్చుకుంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నని ఆరోపించారు. దేశ చరిత్రలో తన అరెస్ట్​.. ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now