Earthquake in China: చైనాలో అర్ధరాత్రి భారీ భూకంపం, దేశ రాజధాని ఢిల్లీని తాకిన ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

చైనాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

చైనాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్‌-జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now