Earthquake in Indonesia: భారీ భూకంపం, 49 సెకన్ల పాటు భూమి కంపించిన భూమి, 44 మంది మృతి,దాదాపు 300 మందికి గాయాలు

ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Earthquake of Magnitude

ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 44 మంది మృతి చెందగా, దాదాపు 300 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భయంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement