Earthquake in Nepal: గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం, వణికిపోయిన హిమాలయ దేశం నేపాల్, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

గురువారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ (Bajura’s Dahakot) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ (Bajura’s Dahakot) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది. దీని తీవ్రత 4.8గా నమోదయింది. మరోసారి రాత్రి 1.15 గంటలకు 5.0 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రివేళ రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

Here's Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)