Indonesia Volcano Eruption: వీడియో ఇదిగో, బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది సజీవ దహనం, మరో 12 మంది ఆచూకి గల్లంతు
ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు.
11 hikers found dead after Mount Merapi erupts in Indonesia: ఇండోనేషియా (Indonesia)లోని పశ్చిమ ప్రాంతంలో సుమత్రా (Sumatra) దీవిలో మౌంట్ మరపి (Mount Merapi)లో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్ని పర్వతం విస్ఫోటనం (volcano eruption) జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 11 మంది మరణించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ 49 మందికి కాపాడామని.. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఘటన తీవ్రత నేపథ్యంలో మౌంట్ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్ ప్రకటించారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Here's Video