ISIS New Chief: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కొత్త చీఫ్‌గా హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి, సిరియా తిరుగుబాటు పోరులో పాత చీఫ్ హసన్ అల్ హషిమీ మృతి

సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు.ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది.

slamic State group. (Photo credits: Wikimedia Commons)

సిరియా తిరుగుబాటు శక్తులతో జరిగిన భీకర పోరులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధినేత హసన్ అల్ హషిమీ అల్ ఖురేషి హతమయ్యాడు.ఈ విషయాన్ని ఐసిస్ బుధవారం ఓ ఆడియో సందేశంలో తెలిపింది. తమ కొత్త నాయకుడిగా అబు అల్ హుస్సేన్ అల్ హుస్సేనీ అల్ ఖురేషిని ఎన్నుకున్నట్లు చెప్పింది. ఐసిస్ అధినేత మరణాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ఈయన సిరియాలో అమెరికా దళాలను పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ నెల మధ్యలో దక్షిణ సిరియా రెబల్స్.. హసన్ అల్ హమిషీని హతమార్చినట్లు పేర్కొన్నారు.

ఐసిస్‌ చీఫ్‌గా హసన్ అల్ హషిమీ 9 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టాడు. అతనికి ముందు ఈ ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా అబు ఇబ్రహీం ఖురేషి ఉండేవాడు. అమెరికా దళాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడ్ని సిరియాలో మట్టుబెట్టాయి.

Here;s Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement