Hardeep Singh Nijjar Killing: నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్, అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్‌ అని హెచ్చరిక జారీ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టు

ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.

Khalistani Terrorist and Narendra Modi Stadium (Photo-X)

ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో ఖలిస్థాన్ టెర్రరిస్టు గుర్‌పత్వంత్ సింగ్ పన్ను మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు.ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.ఈ అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్‌కు నాంది అన్నారు.

ఈ సందేశం గుర్‌పత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్‌లో ఉంది.అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌కు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.

Khalistani Terrorist and Narendra Modi Stadium (Photo-X)

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now