US: యూకేలో దారుణం, డోర్ తీసినందుకు థ్యాంక్ యూ చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఓ వ్యక్తి, సీసీటీవీ పుటేజీలో రికార్డయిన వీడియో
37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ‍్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
అమెరికాలోని బ్రూక్లిన్‌లో థ్యాంక్ యూ చెప్పలేదని మొదలైన వాగ్వాదంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా చంపేశాడు. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ‍్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పార్క్ స్లోప్‌లోని 4వ అవెన్యూ భవనం స్మోకింగ్ దుకాణంలోకి తెల్ల రంగు టీషర్ట్ ధరించిన బాధితుడు లోపలికి రాగా.. మరో వ్యక్తి డోర్ తెరిచాడు. అయితే, డోర్ తెరిచినందుకు కృతజ్ఞతలు తెలపకపోవటంపై లోపలి వ్యక్తి ప్రశ్నించాడు.
దాంతో తాను తెరవాలని కోరలేదని, థ్యాంక్ యూ చెప్పనని స్పష్టం చేశాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. బయటకు వెళ్లిన నిందితుడు తన సైకిల్ పై ఉన్న కత్తిని తీసుకొచ్చి బెదిరించాడు. బాధితుడు వెనక్కి తగ్గకుండా రెచ్చగొట‍్టగా.. పొట్ట, మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ బ్రూక్లిన్ మెథొడిస్ట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)