Gas Station Blast: గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు, 20 మంది మంటల్లో అక్కడికక్కడే మృతి, 300 మందికి తీవ్ర గాయాలు, నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఘటన

నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్‌ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు దిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Blast (Photo Credits: Pixabay/ Representational Image)

నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్‌ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు దిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నాగోర్నో-కరాబాఖ్‌ వివాదాస్పద ప్రాంతం విషయంలో అజర్‌బైజాన్‌-ఆర్మేనియా మధ్య వివాదం రాజుకుంది. దీంతో అక్కడి ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌ బైజాన్‌ దళాలు తిరుగుబాటు లేవనెత్తింది. దీంతో వేలాది మంది వేల మంది తమ వాహనాల్లో ఆర్మేనియాకు బయలుదేరారు.ఈ క్రమంలో ఓ గ్యాస్‌ స్టేషన్‌ వద్ద ఇంధనం కోసం వాహనాలు క్యూ కట్టాయి. అదే సమయంలో అక్కడ భారీ పేలుడు సంభవించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement