Texas: సరదాగా తలపై టపాసులు పేల్చుకున్న ఓ వ్యక్తి, అవి పుర్రెను చీల్చుకుంటూ తల లోపలకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి
అమెరికాలోని టెక్సాస్ లో తలపై టపాసులు పేల్చుకున్నవ్యక్తి... తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు.
అమెరికాలోని టెక్సాస్ లో తలపై టపాసులు పేల్చుకున్నవ్యక్తి... తల పగిలిపోయి దుర్మరణం పాలయ్యాడు. పాబ్లో రూయిజ్ అనే 43 ఏళ్ల వ్యక్తి స్నేహితులతో పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తలపై బాణాసంచా కాల్చుకున్నాడు. దీంతో తలపై పేలిన బాణాసంచా అతని పుర్రెను చీల్చుకుంటూ లోపలకు వెళ్లాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాబ్లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదకర ఫీట్ చేసే సమయంలో పాబ్లో ఫుల్లుగా మందుకొట్టి ఉన్నాడని, ఆ మత్తులోనే ఈ చర్యకు పాల్పడ్డాడని అతని స్నేహితుడు వెల్లడించాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)