Ukraine Helicopter Crash:ఘోర విమాన ప్రమాదంలో 16 మంది మృతి, హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెలుపల ఘటన

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ పోలీసులు తెలిపారు.

Credits: Video Grab

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారుల ఉన్నారని వెల్లడించారు.ఈ ఘటన కీవ్‌కి ఈశాన్యంగా సుమారు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న బ్రోవరీ పట్టణంలోని కిండర్‌గార్డెన్‌ సమీపంలో జరిగింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో వైద్యులు, పోలీసులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో సంఘటనా స్థలంలో బాధితుల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement