Joe Biden Falls On Plane's Stairs: వైరల్ వీడియో..విమానం ఎక్కుతూ మెట్లపై నుంచి జారి పడిపోయిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) విమానం ఎక్కుతూ మెట్లపై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్‌ (Poland) పర్యటన ముగించుకుని బైడెన్‌ అమెరికా (America)కు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Air Force One)ఎక్కే సమయంలో కాలు స్లిప్‌ అయ్యి మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.

Joe Biden (Photo Credits: IANS)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) విమానం ఎక్కుతూ మెట్లపై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్, పోలాండ్‌ (Poland) పర్యటన ముగించుకుని బైడెన్‌ అమెరికా (America)కు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ (Air Force One)ఎక్కే సమయంలో కాలు స్లిప్‌ అయ్యి మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.వెంటనే తన చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now