T20 World Cup 2021 PAK Vs AFG: టెన్షన్ మ్యాచులో పాకిస్థాన్ విజయం, పోరాడి ఓడిన అఫ్గనిస్తాన్, సిక్సులతో గట్టెక్కించిన ఆసిఫ్‌ అలీ

టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ విజయపరంపర కొనసాగుతుంది. నేడు దుబాయిలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

Image credit : Twitter

టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ విజయపరంపర కొనసాగుతుంది. నేడు దుబాయిలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 19 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. చివర్లో ఆసిఫ్‌ అలీ( 7 బంతుల్లో 25) 4 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడగా, అంతకు ముందు బాబర్‌ అజమ్‌ 51 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అఫ్గన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీయగా.. మహ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఈ విజయంతో పాకిస్తాన్‌ సెమీస్‌ రేసును దాదాపు ఖరారు చేసుకుంది.

అంతకు ముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయిన అఫ్గన్‌ ఒక దశలో 100 పరుగులు దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే కెప్టెన్‌ మహ్మద్‌ నబీ 35, గుల్బదిన్‌ నయిబ్‌ 35 పరుగులు కలిసి ఏడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో అఫ్గనిస్తాన్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీమ్‌ రెండు వికెట్లు తీయగా.. షాహిన్‌ అఫ్రిది, హారిస్‌ రౌఫ్‌, హసన్‌ అలీ, షాబాద్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement