7.1 Feet Height, Zero Brain: హైటు పెరిగింది కాని బుర్ర పెరగలేదు, నువ్వెవరో ఇప్పుడు గూగుల్‌లో వెతకాలి, మహమ్మద్ ఇర్ఫాన్‌ని ట్విట్టర్లో ఆడుకుంటున్న ఇండియన్లు, గౌతం గంభీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ పేసర్

నీవు 7. 1 అడుగులు ఎత్తు అయితే పెరిగావు. కాని నీ బుర్ర మాత్రం జీరోనే. అది ఇంకా బాల్య దశలోనే ఉంది. నీ కెరీర్ ఎక్కడుందో ముందు నీవు తెలుసుకో ఆ తర్వాత గౌతం గంభీర్ గురించి మాట్లాడవచ్చు అంటూ పాకిస్తాన్ ఫేస్ బౌలర్ మహమద్ ఇర్ఫాన్‌ని ఇండియన్లు ట్విట్టర్లో ఆడేసుకుంటున్నారు.

Twitter troll Mohammad Irfan for claiming to end Gambhir's career (file image)

New Delhi, October 0 7:  ఓయ్ మహహ్మద్ ఇర్ఫాన్.. నీవు 7. 1 అడుగులు ఎత్తు అయితే పెరిగావు. కాని నీ బుర్ర మాత్రం జీరోనే. అది ఇంకా బాల్య దశలోనే ఉంది. నీ కెరీర్ ఎక్కడుందో ముందు నీవు తెలుసుకో ఆ తర్వాత గౌతం గంభీర్ గురించి మాట్లాడవచ్చు అంటూ పాకిస్తాన్ ఫేస్ బౌలర్ మహమద్ ఇర్ఫాన్‌ని ఇండియన్లు ట్విట్టర్లో ఆడేసుకుంటున్నారు.  2017లో పీసీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు కింద నిషేధం ఎదుర్కొన్న ఇర్ఫాన్‌.. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించడంలో విఫలమయ్యాడు. దీంతో వారు అసలు నిన్ను ఎక్కడా చూడలేదు. ఇంతకీ నువ్వెవరు అంటూ సెటైర్లు వేస్తున్నారు. పాకిస్తాన్ కి ఇండియాకి వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అది క్రికెట్ కూడా పాకేలా ఉంది.

విషయం ఏంటంటే... భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రికెట్ కెరీర్‌ తన కారణంగానే ముగిసిందని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. 2012‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో గౌతమ్ గంభీర్‌ని నాలుగు సార్లు ఔట్ చేసానని చెప్పాడు.

జోక్ వేసాడు నవ్వండి అంటూ ట్వీట్

దీంతో అతని కెరిర్ ఓ రకంగా నా వల్లే ముగిసిపోయినట్లయిందంటూ చెప్పుకొచ్చారు. కాగా ఆ సిరీస్‌ తర్వాత టీ20ల్లో గంభీర్‌పై వేటు పడగా 2013, జనవరి తర్వాత వన్డేల్లోనూ ఈ మాజీ ఓపెనర్‌కి అవకాశం దక్కలేదు. ఆ తర్వాత సుదీర్ఘకాలం భారత్ జట్టులో చోటు కోసం నిరీక్షించిన గౌతమ్ గంభీర్ గత ఏడాది చివర్లో రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతను బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నాడు.

ట్విట్టర్లో ఆడేసుకుంటున్న ఇండియన్లు

పాకిస్థాన్‌లోని ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు ఆడినప్పుడు బ్యాట్స్‌మన్‌ నన్ను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. నా ఎత్తు కారణంగా నేను వేసే బంతుల్ని సరిగా అంచనా వేయలేకపోయేవారు. ఇక గంభీర్‌ అయితే నా కళ్లలోకి చూడలేకపోయేవాడు. నా కళ్లలోకి చూడటానికి భయపడేవాడు. రెండు జట్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో ఉన్నప్పుడు కూడా నా కళ్లలోకి చూసేవాడు కాదు' అని ఇర్ఫాన్ అన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చాలా ఇబ్బందిపడ్డాడు.

మీ క్రికెట్ ఎండ్ అయింది చూసుకో

130-135 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తా అనుకున్నాడు. కానీ 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశా. మరొ చివరలో ఉన్న యువరాజ్ సింగ్ కూడా నా బౌలింగ్‌లో షాట్లు ఆడొద్దని కోహ్లీకి పంజాబీలో చెప్పాడు' అని ఇర్ఫాన్ తెలిపాడు.2012 సిరీస్‌లో నాలుగు సార్లు అతడ్ని నేను ఔట్ చేశా. ఆ సిరీస్ తర్వాత అతని కెరీర్‌ ముగిసింది.. కాబట్టి నాపై అతనికి ఇప్పటికీ కోపం ఉంటుంది’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.

ఇర్ఫాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే గౌతమ్ గంభీర్ అంటే మొదటి నుంచి పాకిస్థాన్ క్రికెటర్లకి ఓ విద్వేష భావం ఉంది. ఈ క్రమంలో కవ్వింపులకి దిగగా.. చాలా సార్లు మైదానంలోనే ఆ దేశ ఆటగాళ్లతో గౌతమ్ గంభీర్ మాటల యుద్ధానికి దిగాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఈ గొడవలు ఆగడం లేదు. ఇటీవల కాశ్మీర్ విభజనపై అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా గంభీర్ గట్టి వార్నింగ్‌తో నోరు మూయించాడు. ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో ట్విట్టర్లో ఇండియన్లు అతన్ని దుమ్ముదులుపుతున్నారు.

స్టాటిస్టిక్స్

నీ గురించి ఇప్పుడు మేము గూగుల్ లో సెర్చ్ చేయాలి. గంభీర్ కెరీర్ కాదు ముందు నీ కెరిర్ ముగించిదెవరో తెలుసుకో అని మండిపడుతున్నారు. గంభీర్ ప్రపంచకప్ విజేత మరి నువ్వు ఫిక్సింగ్ ప్రపంచంలో కళంకితుడివి అని ట్విట్టర్లో ఘాటుగా స్పందిస్తున్నారు.