Hyderabad, Jan 18: హైదరాబాద్ (Hyderabad) లో ట్రాఫిక్ (Traffic) రద్దీ గురించి తెలిసిందే. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది. గ్రీన్ ఛానెల్ ద్వారా మెట్రోలో గుండెను తరలించటంతో ఆ వ్యక్తి ప్రాణం నిలిచింది. ఎల్బీనగర్ నుంచి లక్డీకపూల్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి సకాలంలో గుండె మార్పిడి చేయటంతో వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించినట్లయింది.
Here's Video:
హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు
మెట్రో లో గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గుండెను తరలించిన వైద్యులు
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి లక్డికాపూల్ లోని గ్లోబల్ హాస్పిటల్ కు గుండె తరలింపు pic.twitter.com/7thjJm1L3i
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025
ఎల్బీ నగర్ - లక్డీకపుల్
వివరాల్లోకి వెళితే.. జనవరి 17న రాత్రి 9 గంటల సమయంలో ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ లో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో అతడి అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. లక్డీకపుల్ లోని గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో ఓ వ్యక్తి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో అతడికి దాత గుండెను అమర్చాలని డాక్టర్లు భావించారు. అయితే ఎల్బీనగర్ నుంచి గ్లెనీగల్స్ ఆసుపత్రికి నిర్ణీత సమయంలో గుండెను తరలించటం సవాల్ గా మారింది. ఈ దారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సకాలంలో గుండెను తరలించకపోతే ఉపయోగం ఉండదు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఎల్బీనగర్ మెట్రోను ఆశ్రయించారు.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
ప్రాణదానం
వ్యక్తి ప్రాణం కాపాడేందుకు సహకరించాలని మెట్రో అధికారులను కోరారు. దీంతో వేగంగా స్పందించిన మెట్రో అధికారులు.. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకపూల్ వరకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. మెుత్తం ఎల్బీనగర్ నుంచి 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో లక్డీకపూల్ హాస్పిటల్ కు గుండెను చేర్చారు. అలా ఆ వ్యక్తికి ప్రాణదానం చేశారు.