Delhi, Feb 6: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఎక్స్ వేదికగా సంచలన ప్రకటన చేశాడు. ఇకపై తన ఆదాయంలో 10 శాతం పేదలకు ఇస్తానని వెల్లడించాడు. యాడ్స్ ద్వారా తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయం(pant Donation) అందించనున్నట్లు ప్రకటించాడు. పంత్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన పంత్... క్రికెట్ వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను అని తెలిపాడు. క్రికెట్ తనకు అందించిన దానికి కృతజ్ఞతగా, సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచన నా మనసులో ఉందని అందుకే యాడ్స్ ద్వారా తాను సంపాదించే దానిలో పది శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్(Rishabh Pant Foundation) ద్వారా పేదలకు ఖర్చు చేస్తానిన తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను అందరికి చెబుతానని వెల్లడించాడు పంత్.
2017లో టీమిండియా(Team India) తరపున ఆరంగేట్రం చేశాడు పంత్. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పంత్.. జట్టులో కీలక ఆటగాడిగా ఏదిగాడు. గత ఏడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవగా జట్టులో పంత్ కూడా ఓ సభ్యుడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై సైతం దూకుడుగా ఆడటంలో పంత్ మరెవ్వరూ సాటిరారు.
Team India Cricketer Rishabh Pant to donate 10% of His Earnings to poor people
#RishabhPantFoundation #RP17 pic.twitter.com/WV45tNDI3g
— Rishabh Pant (@RishabhPant17) February 5, 2025
అలాగే ఐపీఎల్ 2025(IPL 2025) వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ని ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడమే కాదు కెప్టెన్‌గా కూడా నియమించింది.