Hyderabad, Dec 24: సంధ్య థియేటర్ లో (Sandhya Theatre) జరిగిన తొక్కిసలాట (Stampede) కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్టేషన్ కు రానున్నట్టు సమాచారం. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్ కు బన్నీ రావాల్సి ఉంటుందని సోమవారం పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో తెలిపినట్లు సమాచారం. దీంతో బన్నీ థియేటర్ కు మళ్లీ వెళ్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.
మరోసారి సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్?
నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణ నిమిత్తం హాజరుకానున్నారు. ఈక్రమంలో సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే సంధ్య థియేటర్‌కు బన్నీ రావాల్సి ఉంటుందని నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో తెలిపినట్లు సమాచారం. సంధ్య… pic.twitter.com/uFQtvUibLd
— ChotaNews (@ChotaNewsTelugu) December 24, 2024
భయంలో అభిమానులు
హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ ను విచారణ పేరిట పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారేమోనని ఆయన అభిమానులు భయపడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.