Hyderabad, Dec 24: సినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ అవార్డు(National Award) మొదటిది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) ఇద్దరూ ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. అయితే, సంధ్య థియేటర్ ఘటనలో బన్నీ అరెస్టై బెయిల్ మీద బయటకు రాగా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జానీ మాస్టర్ కూడా బెయిల్ మీద బయటకొచ్చారు. ఇప్పుడు ఇదే టాపిక్ పై ఓ మీడియా ప్రతినిధి జానీ మాస్టర్ ను ప్రశ్నించారు.
Here's Video:
అల్లు అర్జున్ అరెస్ట్ గురించి అడగగానే జానీమాస్టర్ వెళ్ళిపోయాడు.. pic.twitter.com/Dr4mcKIxnj
— ChotaNews (@ChotaNewsTelugu) December 24, 2024
అక్కడ్నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం
జానీ మాస్టర్ తో సదరు మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ కు, మీకు జాతీయ అవార్డు వచ్చిన తర్వాతే అరెస్ట్ అయ్యారు. దీనిపై మీ సమాధానం ఏంటి?’ అని ప్రశ్నించగా.. జానీ మాస్టర్ సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.