టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ద్రావిడ్ ప్రయాణిస్తోన్న కారు, ఓ గూడ్స్ ఆటో ఢీ (Rahul Dravid Car collision)కొన్నాయి. దీంతో రోడ్డుపై ఆటో డ్రైవర్‌తో ద్రవిడ్ వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరుగగా బెంగళూరు(Bengaluru)లోని బిజీ ఏరియా కన్నింఘమ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం
ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్ వెనక నుంచి స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టాడని తెలుస్తోండగా ఈ సంఘటనకు సంబంధించి 11 సెకన్ల వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Rahul Dravid Car Suffers Collision With Auto In Bengaluru.. Here are the details
Indian cricketer Rahul Dravid's car & a commercial goods vehicle were involved in a minor accident on Cunningham road in #Bengaluru. And unlike the #cred ad, #RahulDravid & the goods vehicle driver engaged in a civilized argument & left the place later. No complaint so far pic.twitter.com/HJHQx5er3P
— Harish Upadhya (@harishupadhya) February 4, 2025
52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్‌లో వాల్‌గా గుర్తింపు పొదారు. టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 24,000కి పైగా రన్స్ చేసిన ద్రవిడ్ 2007 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు.
టీమిండియా హెడ్ కోచ్‌గా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాత ఆయన పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రధాన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ద్రవిడ్.