Ben Duckett Dismissal Video: వీడియో ఇదిగో, కంట్రోల్ కోల్పోయిన బుమ్రా చేతిలో బలైన డకెట్, టీమిండియా పేసర్ ఇన్ స్వింగ్ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన ఇంగ్లండ్ బ్యాటర్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు. అప్పటికే వరుస బౌండరీలతో భారత్ ను భయపెట్టిన డకెట్ ను ఓ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు బుమ్రా. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు.
దీంతో రివ్యూకు వెళ్దామని బుమ్రా అనుకున్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ కీపర్ కేఎస్ భరత్ వైపు చూశాడు. ఎల్బీడబ్ల్యూనా? కాదా? రివ్యూకు వెళ్దామా అని అతడ్ని అడిగాడు. అయితే డీఆర్ఎస్ వద్దని భరత్ చెప్పడంతో హిట్‌మ్యాన్ ఆగిపోయాడు. కానీ రీప్లేలో డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు తేలింది. దీంతో బుమ్రా కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కానీ తన అగ్రెషన్‌ను భరత్ మీద కాకుండా డకెట్ మీద చూపించాడు. ఆ ఓవర్లో మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసిన పేసుగుర్రం ఈసారి ఇంగ్లండ్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫోర్త్ స్టంప్ మీద పడిన బంతి ఇన్ స్వింగ్ అయి డకెట్ ఆఫ్ వికెట్‌ను గిరాటేసింది. బుమ్రా వేసిన స్పీడ్‌కు వికెట్ ఎగిరి చాలా దూరంగా పడింది.
Here's Video