IPL 2023: హైదరాబాద్‌ ఇంటి దారి పట్టకుండా కాపాడిన గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రూక్ ఎందుకు ఇక దండగ అంటూ సన్ రైజర్స్ అభిమానులు ట్రోల్

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్‌ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్‌ సమద్‌ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్‌ గెలవడం..అంతా ఊపిరి బిగపట్టే క్షణాలే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి మాత్రం డైనమైట్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ననే చెప్పవచ్చు.

Glenn Phillips

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్‌ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్‌ సమద్‌ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్‌ గెలవడం..అంతా ఊపిరి బిగపట్టే క్షణాలే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి మాత్రం డైనమైట్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ననే చెప్పవచ్చు.

ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 18 బంతుల్లో 44 పరుగులు కావాల్సిన తరుణంలో ఫిలిప్స్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (7 బంతుల్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్‌ సాయంతో 25) ఆడి అసాధ్యమనుకున్న గెలుపుపై ఆశల రేకెత్తించాడు. కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 18వ ఓవర్లో తొలి నాలుగు బంతులను 6, 6, 6, 4గా మలచిన ఫిలిప్స్‌ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ చేతుల్లోకి తెచ్చాడు. ఫిలిప్స్‌ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా ఓటమిపాలై, లీగ్‌ నుంచి నిష్క్రమించేది.

లాస్ట్ బాల్‌ వరకు ఉత్కంఠ, రాజస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం, భారీ టార్గెట్‌ చేధించిన సన్‌రైజర్స్

ఫిలిప్స్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్‌ ఫిలిప్స్‌.. సనరైజర్స్‌ హ్యారీ బ్రూక్‌ను వదిలించుకుని నీకు అవకాశమిచ్చి మంచి పని చేసిందంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. 13.25 ఆటగాడి (బ్రూక్‌) కంటే అందులో పది శాతం (1.5 కోట్లు) కూడా రేటు దక్కని ఫిలిప్స్‌ చాలా బెటరని అంటున్నారు.ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మినుకమినుకుమంటున్న దశలో ఫిలిప్స్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ను ఫైనల్‌ ఫోర్‌కు చేరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (59 బంతుల్లో 95; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, కెప్టెన్‌ సంజు శాంసన్‌ (38 బంతుల్లో 66 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.

భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్‌ శర్మ (34 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు), సమద్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 సిక్స్‌లు) చెలరేగడంతో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి విజయం సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి సన్‌రైజర్స్‌ను గెలిపించిన గ్లెన్‌ ఫిలిప్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement