RR vs SRH (PIC@ IPL Twitter)

Jaipur, May 07: రాజస్థాన్‌ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది (SRH Win). 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. అన్మోల్ ప్రీత్‌సింగ్ (33; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (55; 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (47; 29 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్‌ (25; 7 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. అబ్దుల్ సమద్ (17; 7 బంతుల్లో ) సిక్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుల్‌దీప్‌ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

అంతకుముందు సొంత గ్రౌండ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు దంచారు. ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్(95) విధ్వంస‌క బ్యాటింగ్, సంజూ శాంస‌న్(66 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. హైద‌రాబాద్ ముందు 215 ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సీజ‌న్‌లో సెంచ‌రీ కొట్టిన‌ య‌శ‌స్వీ జైస్వాల్(35) త్వ‌ర‌గానే ఔట‌య్యాడు దాంతో, 54 వ‌ద్ద రాజ‌స్థాన్ వికెట్ ప‌డింది. ఆ త‌ర్వాత బ‌ట్ల‌ర్, శాంస‌న్ జోరు కొన‌సాగించారు. రెండో వికెట్‌కు 138 ర‌న్స్ జోడించారు. హెట్‌మెయిర్ (7) నాటౌట్‌గా నిలిచాడు.

భారీ లక్ష్య ఛేద‌న‌లో హైద‌రాబాద్‌కు మంచి ఆరంభం దొరికింది. ఓపెన‌ర్లు అన్‌మోల్‌ప్రీత్ సింగ్(33) అభిషేక్ శ‌ర్మ(55) తొలి వికెట్‌కు 54 ర‌న్స్ జోడించారు. ధ‌నాధ‌న్ ఆడిన అభిషేక్ హాఫ్ సెంచ‌రీ కొట్టిన వెంట‌నే అశ్విన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ధాటిగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్(26)ను చాహ‌ల్ పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత అత‌ను జోరుమీదున్న‌ రాహుల్ త్రిపాఠి(47)ని, కెప్టెన్ మ‌ర‌క్రం(6)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు.  హ్యారీ బ్రూక్ ప్లేస్‌లో వ‌చ్చిన‌ గ్లెన్ ఫిలిఫ్స్(25) హ్యాట్రిక్ సిక్స‌ర్లు, ఒక ఫోర్‌తో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పాడు.