IPL 2023: రూ. 13 కోట్లు పెట్టి కొంటే ఇంత చెత్తగా ఆడుతున్నావ్, ఇంటికెళ్లి టెస్టులు ఆడుకో పోయి, హ్యారీ బ్రూక్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్న సన్ రైజర్స్ ఫ్యాన్స్

సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

KKR Vs SRH (PIC @ IPL Twitter)

సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో మయాంక్‌ అగర్వాల్‌(49) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాచ్ ను గెలిపిస్తాడనుకున్న హ్యారీ బ్రూక్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో SRH అభిమానులు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

ఉప్పల్ స్టేడియంలో పరువు తీసుకున్న సన్ రైజర్స్, 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి..

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌లో 14 బంతులు ఎదుర్కొని కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. నోర్జే బౌలింగ్‌లో అనవసరపు షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. అంతకుముందు సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ బ్రూక్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన బ్రూక్‌ 163 పరుగులు చేశాడు. అందులో కేకేఆర్‌తో మ్యాచ్‌లో చేసిన 100 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. అంటే మిగితా 6 మ్యాచ్‌ల్లో అతడు కేలం 63 పరుగులు మాత్రమే చేశాడు.

వీడియో ఇదిగో, దారుణంగా అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న డేవిడ్ వార్నర్, కంటతడి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ అభిమానులు

ఇక దారుణంగా విఫలమవుతున్న బ్రూక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌కు వెళ్లి టెస్టులు ఆడుకో పో అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది సెంచరీ కొడితే హీరో అన్నారు.. ఇప్పుడు జీరోనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ ఏడాది సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లు పెట్టి SRH కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement