IPL 2023: వీడియో ఇదిగో, దారుణంగా అవమానించిన సన్‌రైజర్స్‌పై ప్రతీకారం తీర్చుకున్న డేవిడ్ వార్నర్, కంటతడి పెట్టిన ఎస్ఆర్‌హెచ్ అభిమానులు
David Warner (Photo-IPL)

ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో రైజర్స్‌ ఓటమి ఎదుర్కొంది. కాగా గతంలో అవమానకరంగా టీం నుంచి సాగనంపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి డేవిడ్‌ వార్నర్‌ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 24) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టుపై విజయం సాధించడం​ ద్వారా కాలర్ ఎగరేశాడు. విజయానంతరం వార్నర్‌ చేసుకున్న సంబరాలను చూస్తే, అతనిలో సన్‌రైజర్స్‌పై గెలవాలన్న కసి ఏ రేంజ్‌లో ఉండిందో ఇట్టే స్పష్టమవుతుంది.

ఉప్పల్ స్టేడియంలో పరువు తీసుకున్న సన్ రైజర్స్, 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం అందుకోలేక ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి..

డీసీ విజయం సాధించగానే, వార్నర్‌ గాల్లోకి ఎగురుతూ గంతులు వేస్తూ విజయ గర్వంతో ఊగిపోయాడు. తనతోనే డ్రింక్స్‌ మోయిస్తారా.. మీకు ఎలా బుద్ధిచెప్పానో చూడండి అన్న అర్ధం వచ్చేలా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టాడు. తమ ఆటగాళ్లతో గ్రౌండ్‌ మొత్తం​ కలియ తిరుగుతూ నానా హంగామా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలో డీసీ గెలిచింది కేవలం రెండో మ్యాచే అయినా తగ్గేదేలే అంటూ పుష్పలా ఫోటోలకు పోజులిచ్చాడు.

Here's Video

వార్నర్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. వార్నర్‌ హడావుడిని కొందరు తప్పుబడుతుంటే, మరికొందరు అతను ఈ సెలబ్రేషన్స్‌కు అర్హుడేనంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, 2016లో సన్‌రైజర్స్‌కు టైటిల్‌ను అందించిన వార్నర్‌ను, ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ నుంచి పీకేసి, తుది జట్టులో ఆడనీయకుండా, డ్రింక్స్‌ మోపించి పలు రకాలుగా అవమానించింది.