IPL 2023: ఆర్సీబీకి పట్టిన దరిద్రం ఆ బౌలర్, ఇంత చెత్త ఆటగాడిని ఎక్కడా చూడలేదు, హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై మండిపడుతున్న RCB అభిమానులు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై RCB అభిమానులు మండిపడుతున్నారు. అతడు ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని వెంటనే తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు

Harshal Patel (Photo Credits: Twitter)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై RCB అభిమానులు మండిపడుతున్నారు. అతడు ఆర్సీబీకి పట్టిన దరిద్రం అని.. జట్టు నుంచి అతడిని వెంటనే తీసివేస్తేనే బాగుపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంత చెత్త బౌలర్‌ను ఎక్కడా చూడలేదని.. వచ్చే ఏడాదైనా అతడిని వదిలించుకోవాలని ఫ్రాంఛైజీకి సూచిస్తున్నారు. యజువేంద్ర చహల్‌ను వదులుకుని పెద్ద తప్పు చేశారని చురకలు అంటిస్తున్నారు. ఈసారి కూడా ట్రోఫీ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని.. ఇలాంటి బౌలర్‌ను ఆడిస్తే మూల్యం చెల్లించక తప్పదంటూ పెద్ద ఎత్తున హర్షల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

ధోనీ సిక్స్‌లతో ఫ్యాన్స్‌కు పూనకాలు, ఢిల్లీతో మ్యాచ్‌లో వింటేజ్‌ ధోనీ కనిపించాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్, ధోనీ ధనాధన్ సిక్స్‌ల వీడియో ఇదుగోండి!

ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు మొత్తంగా 11 ఇన్నింగ్స్‌ ఆడిన ఈ గుజరాత్ బౌలర్‌ 388 పరుగులు ఇచ్చి 12 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబై బ్యాటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, నేహల్‌ వధేరా దూకుడు నేపథ్యంలో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లను సోషల్‌ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్న ఫ్యాన్స్‌.. ముఖ్యంగా హర్షల్‌ పటేల్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement