IPL 2023: గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి, నేడు పంజాబ్‌తో చావో రేవో తేల్చుకోనున్న రాజస్తాన్‌, ఆశలన్నీ ట్రెంట్‌ బౌల్ట్‌ పైనే పెట్టుకున్న PBKS

ఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

Rajasthan Royals bowlers celebrate after victory (Photo Credits: IPL/Twitter)

ఐపీఎల్‌-2023లో భాగంగా నేడు ధర్మశాల వేదికగా కీలక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ఇంటిముఖం పట్టక తప్పదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఆరింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.అయితే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు.

పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ విజయం సాధిస్తే..శాంసన్ సేన ప్లేఆఫ్స్‌ రేసులో నిలుస్తోంది. అయితే రాజస్తాన్‌ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ తమ తదపరి మ్యాచ్‌ల్లో ఓటమి చెందితే.. ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతోంది.

రూ. 8 కోట్లు పెట్టి ముంబై కొనడం ఎందుకు, మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం ఎందుకు, జోఫ్రా ఆర్చర్‌పై మండిపడిన సునీల్‌ గవాస్కర్‌, ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని హితవు

అయితే ముంబై, ఆర్సీబీ కంటే రాజస్తాన్‌(+0.140) నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించే ఛాన్స్‌ ఉంటుంది. ఇక పంజాబ్‌కు కూడా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు మెథ్యమేటిక్‌గా ఉన్నాయి.పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కచ్చితంగా రాజస్తాన్‌పై భారీ విజయం సాధించాలి. అంతే కాకుండా ముంబై, ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ ఓటమి పాలవ్వాలి. అప్పుడు ఈ మూడు జట్లు 14 పాయింట్లతో సమమవుతాయి. అప్పుడు నెట్‌రన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు వెళ్లే మిగతా మూడు జట్లు ఇవిగో, ఆ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే పరిస్థితి, ముంబై, ఆర్సీబీకి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

ఇక పంజాబ్‌తో కీలక మ్యాచ్‌లో రాజస్తాన్‌ తమ జట్టులో ఒకే మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పంజాబ్‌తో పోరుకు తిరిగి జట్టులోకి రానున్నట్లు సమాచారం. బౌల్ట్‌ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా బెంచ్‌కే పరిమితమయమ్యే ఛాన్స్‌ ఉంది. అదే విధంగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌పై రాజస్తాన్‌ మెనెజెమెంట్‌ మరోసారి నమ్మకం ఉంచనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement