IPL 2023: ఈ చెత్త బ్యాటింగ్ ఏంది సామి, జట్టులో నుంచి పీకేయకుండా ఇంకా ఎందుకు, దీపక్ హుడాపై మండిపడుతున్న లక్నో అభిమానులు

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.

Deepak Hooda (photo-BCCI)

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఇదిలా ఉంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ దీపక్‌ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

జైపూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్‌.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 17 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉన్నాయి.

రూ. 3 కోట్లు నీకు దండగ, ఫినిషర్‌గా పనికిరావు వెళ్లి డ్యాన్సులు వేసుకో, రియాన్ పరాగ్ పై మండిపడుతున్న రాజస్థాన్ రాయల్స్ అభిమానులు

గతేడాది సీజన్‌లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్‌లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్‌లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement