Rajasthan Royals all-rounder Riyan Parag (file image)

జైపూర్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఓటమి పాలైన సంగతి విదితమే. 155 పరుగుల స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది.రాజస్తాన్‌ బ్యాటర్లలో జైశ్వాల్‌(44), జోస్‌ బట్లర్‌(40) మినహా మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్‌, హెట్‌మైర్‌ తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయారు.హెట్‌మైర్‌ ఔటైన తర్వాత ఫినిషర్‌గా క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ మరోసారి నిరాశపరిచాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న పరాగ్‌ తన జట్టును గెలిపించలేకపోయాడు.

లక్నో సూపర్ జెయింట్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం..సొంత గడ్డపై మట్టికరిచిన రాజస్థాన్ రాయల్స్

ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న పరాగ్‌ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి 7 బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాజస్తాన్‌ విజయానికి కావాల్సిన రన్‌రేట్‌ విపరీతంగా పెరిగిపోయింది.ఈ క్రమంలో ఆఖరిలో కొంచెం దూకుడుగా ఆడుతోన్న పడిక్కల్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో రాజస్తాన్‌ ఓటమి ఖారారైంది.

ఇక మరోసారి దారుణ ప్రదర్శన కనబరిచిన పరాగ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడు స్లో ఇన్నింగ్స్‌ వల్లే రాజస్తాన్‌ ఓటమి పాలైందని పోస్టులు చేస్తున్నారు. ఓ యూజర్‌ స్పందిస్తూ.. నీవు క్రికెట్‌కు పనికిరావు.. వెళ్లి డ్యాన్స్‌లు వేసుకోపో అంటూ కామెంట్‌ చేశాడు.రూ. 3 కోట్లు నీకు దండట అని మరో యూజర్ కామెంట్ చేశారు.

జోస్‌ బట్లర్‌ 112 మీటర్ల భారీ సిక్సర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన లక్నో బౌలర్ యుధ్వీర్, వైరల్ అవుతున్న షాట్ క్లిప్

పరాగ్‌ 2019లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 52 మ్యాచ్‌లలో 42 ఇన్నింగ్స్‌లు ఆడిన రియాన్‌.. 576 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్‌ తన ఆటకంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌-2023కు ముందు రూ. 3.8 కోట్లకు అతడిని రాజస్తాన్‌ రిటైన్‌ చేసుకుంది.