IPL 2023: చెత్తగా ఆడుతున్నావు, షాట్ సెలక్షన్ దరిద్రంగా ఉంది, వాళ్లని చూసి నేర్చుకో, పృథ్వీ షాపై తీవ్ర విమర్శలు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌‌ 2023లో (IPL 2023) లక్నోతో (LSG) జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు

Prithvi Shaw (Twitter/IPL)

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఆటతీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఐపీఎల్‌‌ 2023లో (IPL 2023) లక్నోతో (LSG) జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మంగళవారం గుజరాత్‌తో (GTvsDC)జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ చెత్త షాట్ సెలక్షన్ వల్లే పృథ్వీ అవుటయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.

ఆర్సీబీని వెంటాడుతున్న కష్టాలు, ముగ్గురు స్టార్ ప్లేయర్లకు గాయాలు, మడమ గాయంతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న కీలక ఆటగాడు రజత్‌ పటిదార్‌

పృథ్వీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ ఆడిన శుభమన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. మరోవైపు చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కూడా సత్తా చాటుతున్నాడు. అయితే గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని మాజీల ప్రశంసలు అందుకున్న పృథ్వీ మాత్రం ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ షాట్ సెలక్షన్ చాలా చెత్తగా ఉందని షెహ్వాగ్ అన్నాడు.

రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, పాయింట్‌లో డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రోసో

చెత్త షాట్ సెలక్షన్‌తో పృథ్వీ ఇప్పటికే ఎన్నోసార్లు వికెట్లు సమర్పించుకున్నాడు. అయినా తన తప్పుల నుంచి అతడు గుణపాఠం నేర్చుకోవడం లేదు. శుభ్‌మన్ గిల్, గైక్వాడ్‌లను చూడండి. రోజురోజుకూ వారు మరింత ఉన్నతంగా ఆడుతున్నారు. వారిని చూసి పృథ్వీ నేర్చుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Advertisement
Advertisement
Share Now
Advertisement