Indian student G Praveen from Telangana shot dead in US, says family members Watch Videos

అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువకుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్న అతడు.. అక్కడికి వచ్చిన దుండగులను అడ్డుకోబోగా వారు కాల్పులు జరిపి పారిపోయారు.ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు-రమ దంపతుల కుమారుడు ప్రవీణ్‌(27) ఎంఎస్‌ చేయడానికి 2023లో అమెరికా వెళ్లాడు.

అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్​ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మిల్వాకీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒక స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌.. మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా కొందరు దుండగులు అందులోకి ప్రవేశించారు. వారిని అడ్డగించడానికి ప్రవీణ్‌ ప్రయత్నించగా తుపాకులతో కాల్పులు జరిపారు. గాయపడిన ప్రవీణ్‌ను మిల్వాకీ పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు ప్రవీణ్‌ తల్లిదండ్రులకు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు.

Telangana Student Shot Dead in US:

ఈ ఘటనపై చికాగో భారత రాయబార కార్యాలయం స్పందించింది. విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి ప్రవీణ్ కుమార్ గంప అకాల మరణం మాకు బాధ కలిగించింది. కాన్సులేట్ ప్రవీణ్ కుటుంబంతో మరియు విశ్వవిద్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది, వారికి సాధ్యమైనంత మద్దతుతో సహాయం చేస్తోంది. మరణించిన వారి కుటుంబం మరియు స్నేహితులకు మా హృదయపూర్వక సంతాపం మరియు ప్రార్థనలు తెలియజేస్తున్నాముని ప్రకటించింది.

3 నెలల్లో ఎంఎస్‌ పూర్తి చేసుకుని ప్రవీణ్‌ రావాల్సి ఉందని.. ఇంతలోనే దారుణం జరిగిపోయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.