అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి రప్పించాల్సిందిగా అధికారులను తండ్రి కోరాడు.
అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి
కాగా 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి అక్కడ ఉద్యోగం వెతుక్కుంటున్నాడు.ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ ఏస్‌లో గత రాత్రి ఒక్కసారిగా యువకుడిపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రవితేజ ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందిన వెంటనే అక్కడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. రవితేజ మృతి సమాచారాన్ని హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులకు తెలియజేశారు. రవితేజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Indian student Raviteja from Hyderabad shot dead in U.S.
అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతిచెందిన హైదరాబాద్ యువకుడి ఇంట్లో అలుముకున్న విషాద ఛాయలు
అతడి మరణవార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు
అమెరికా వాషింగ్టన్ ఏవ్‌లో జరిగిన దుండగులు కాల్పులలో మృతిచెందిన రవితేజ అనే యువకుడు https://t.co/fxYp5tL3Eu pic.twitter.com/Sbm81DDzVo
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)