IND vs NZ 1st ODI: మళ్లీ నిరాశ పరిచిన భారత వికెట్ కీపర్ పంత్.. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఫెయిల్.. ఫార్మాట్ మారినా ఆట మారడం లేదని నెటిజన్ల మండిపాటు

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ మారినా అతని ఆట మాత్రం మారడం లేదు. న్యూజిలాండ్ పై ఆడిన రెండు టీ20ల్లోనూ పేలవ షాట్లతో వికెట్ పారేసున్నాడు.

Rishab Pant (Credits: Instagram)

Newdelhi, Nov 25: భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishab Pant) తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ (Formate) మారినా అతని ఆట మాత్రం మారడం లేదు. న్యూజిలాండ్ (Newzealand) పై ఆడిన రెండు టీ20ల్లోనూ పేలవ షాట్లతో వికెట్ పారేసున్నాడు. తాజాగా, వన్డే ఫార్మాట్ లోనూ అదే వైఫల్యం కొనసాగించాడు. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. నాలుగో నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ 23 బంతుల్లో (Balls) కేవలం 15 పరుగులు (Runs) మాత్రమే సాధించాడు. రెండు ఫోర్లు కొట్టిన అతను ఫెర్గూసన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

‘ఒక పక్షి ఇసుక తవ్విపోస్తుంటే.. మరో పక్షి వెనక్కి నెడుతున్న తీరు’.. టీమ్ వర్క్ పై కళ్లు తెరిపించే వీడియో.. ఆనంద్ మహీంద్రా పోస్ట్.. వైరల్ 

మరో వైపు టీ20 సిరీస్ లో సెంచరీతో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసిన అతను కూడా ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఓపెనర్లు శిఖర్ ధవన్ (72), శుభ్ మన్ గిల్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. మిడిలార్డర్ లో పంత్, సూర్యకుమార్ విఫలమవగా.. శ్రేయస్ అయ్యర్ (48నాటౌట్), సంజూ శాంసన్ (25 నాటౌట్) బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నారు. దాంతో, 41 ఓవర్లకు 4 వికెట్లకు 217 పరుగులు చేసిన భారత్ మంచి స్కోరు చేసే దిశగా సాగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement