Rishabh Pant Health Update: వేగంగా కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌, ఈ వారంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని తెలిపిన వైద్యులు, పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు ప్రకటన

పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే (set to be discharged from hospital this week) అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు.

Rishabh Pant (Photo Credits: IANS)

గతేడాది డిసెంబర్‌ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్‌ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్‌ ఆటగాడు ఆరోగ్యంపై (Rishabh Pant Health Update) డాక్టర్లు శుభవార్తను అందించాడు. పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే (set to be discharged from hospital this week) అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు.

క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్, ప్రపంచకప్‌కి దూరం కానున్న రిషభ్‌ పంత్‌, మరో ఆరు వారాల్లో మరో కీలక సర్జరీ

అయితే మార్చిలో పంత్‌కు (Rishabh Pant) మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని, పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని వైద్యులు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా ధృవీకరించారు. పంత్‌ బెడ్‌ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం, ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందన్న భయంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్‌ చేసిన వైద్యులు

ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌, ఆతర్వాత జరిగే ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లకు కూడా పంత్ దూరమైనట్లే.ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో పడింది

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement