T20 Worldcup 2021: South Africa Vs West Indies మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన విండీస్
T20 Worldcup 2021లో వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచు ఎలాంటి మెరుపులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ఉత్కంఠ భరితంగా జరగాల్సిన టీ 20 సిరీస్ పోరులో ఇప్పటి వరకూ సరైన వేడి అందుకోలేదు. తాజాగా నేడు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
T20 Worldcup 2021లో నేడు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ తన పేలవమైన ఫామ్ కంటిన్యూ చేస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 144 పరుగుల లక్ష్యం విధించగా, దక్షిణాఫ్రికా ఆడుతూ పాడుతూ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ బవుమా తొందరగానే ఔట్ అయినప్పటికీ, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(39) రాణించాడు. ఆ తర్వాత వచ్చిన ఎయిడెన్ మార్క్రమ్(51 నాటౌట్), వాన్ డర్ డస్సెన్(43 నాటౌట్) అజేయంగా నిలిచి సౌతాఫ్రికాకు విజయతీరాలకు చేర్చారు.
ఇదిలా ఉంటే టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే చెరో ఓటమి చవిచూసి బోణి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంగ్లండ్ చేతిలో విండీస్ ఓటమిపాలు కాగా, అటు సౌతాఫ్రికా కూడా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై విజయం కోసం ఎదురు చూడటం విశేషం.