IPL 2023: అదేమి బౌలింగ్ సామి, అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకి బీసీసీఐకి రూ. 80 లక్షలకు పైగా నష్టం, పంజాబ్ బౌలర్ యార్కర్ల ధాటికి రెండుసార్లు విరిగిపోయిన స్టంప్స్
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంలో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బీసీసీఐకి ఏకంగా రూ.88 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించాడు.
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ విజయంలో పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బీసీసీఐకి ఏకంగా రూ.88 లక్షలకు పైగా నష్టాన్ని కలిగించాడు. విషయంలోకి వెళితే.. ముంబై విజయానికి ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావల్సిన నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కుర్రాన్ బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు.
ఆఖరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ముంబై తిలక్ వర్మ, వధేరాలను బౌల్డ్ చేశాడు. అర్ష్‌దీప్ వేసిన యార్కర్ల ధాటికి రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ విరిగి పోవడం విశేషం. అయితే అర్ష్‌దీప్ దెబ్బకు బీసీసీఐకి రూ. 88 లక్షల నష్టం వాటిల్లింది.
Here's Video
ఐపీఎల్‌లో జింగ్ బెయిల్స్ స్టంప్స్‌ను వాడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో వికెట్ సెట్ ఖరీదు దాదాపు 48 వేల డాలర్లు. అంటే భారత కరెన్సీలో సూమారు రూ. 44 లక్షల అన్నమాట. అయితే ఇటువంటి సందర్భాల్లో వికెట్ సెట్‌మొత్తం మార్చేయాల్సి వస్తుంది. రెండు సార్లు అర్ష్‌దీప్ స్టంప్‌ను బ్రేక్ చేశాడు కాబట్టి బీసీసీ రూ. 88 లక్షలు నష్టం వచ్చినట్లే అని చెప్పుకోవాలి.