
Hyd, March 06: టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరు సౌరవ్ గంగూలీ. మొన్నటివరకు గ్రౌండ్‌లో ఆ తర్వాత మెంటర్‌గా అదరగొట్టిన గంగూలీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అలరించనున్నాడు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కిస్తున్న ఖాకీ2లో(Sourav Ganguly Acting Debut) కీలక పాత్ర పోషించనున్నాడు.
ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, శాశ్వత, జీత్, పరంబ్రత ఛటర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ఖాకీ ది బెంగాల్ చాప్టర్ (ఖాకీ 2).
మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్‌సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్(Sourav Ganguly). ఇందుకు సంబంధించి గంగూలీ ఖాకీ డ్రెస్ వేసుకోగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
Sourav Ganguly Make Acting Debut..!
Sourav Ganguly in Khakee The Bengal Chapter (I think Promotion Shoot)
Exclusive Pic#KhakeeTheBengalChapterOnNetflix#NextOnNetflixIndia #SouravGanguly#KhakeeTheBengalChapter#KhakeeTheBengalChapterTrailer pic.twitter.com/phH1ShkZv0
— YourPritam (@iyourpritam) March 5, 2025
అయితే మరికొంతమంది మాత్రం గంగూలీ(Khakee 2) వేలం ప్రమోషన్స్‌లో భాగంగా గంగూలీ ఖాకీ డ్రెస్ వేసుకున్నారని అంటున్నారు. అసలు గంగూలీ నటించాడా లేదా అన్నది తెలియాలంటే మార్చి 20 వరకు వేచిచూడాల్సిందే. ఐపీఎల్ ఆఫీసర్ అమిత్ లోథా జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఖాకీ ది బిహార్ చాప్టర్ తెరకెక్కింది. 2022లో నెట్‌ఫ్లిక్స్ విడుదలైన ఈ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. దీనికి కొనసాగింపుగా ఖాకీ 2 తెరకెక్కింది.