World Cup 2023 Final, India Vs Australia: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో తడబడిన భారత్ బ్యాటర్లు...100 పరుగుల లోపే మూడు వికెట్లు పతనం..రోహిత్, గిల్, అయ్యర్ ఔట్..

టీమ్ ఇండియా 12 ఓవర్లలో 87 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా తరుపున శుభ్‌మన్ గిల్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు.

australia vs india

ప్రపంచ కప్‌లో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, కొద్దిసేపటికే రోహిత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్‌గా ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.  అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరంభం అంతగా రాణించలేదు. ఈ వార్త రాసే సమయానికి టీమ్ ఇండియా 12 ఓవర్లలో 87 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా తరుపున శుభ్‌మన్ గిల్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. రోహిత్ ఔట్ అయిన మరుసటి ఓవర్‌లో, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పైనే టీం ఇండియా ఆశలు ఉన్నాయి.

> హిట్టింగ్ కోసం ప్రయత్నిస్తూ.. వికెట్లు కోల్పోతున్న భారత్

>> మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

>> కేవలం 4 రన్స్ చేసి ఔట్ అయిన అయ్యర్

>> రోహిత్ శర్మ తర్వాత.. గ్రౌండ్ లోకి వచ్చిన అయ్యర్

>> 10.3 ఓవర్లలో కీలకమై మూడు వికెట్లు డౌన్..

>> ఓవర్ల చాలా ఉన్నాయి.. వికెట్లు తక్కువగా ఉన్నాయి

>> టాప్ ఆర్డర్ లో ముగ్గురు వెంట వెంటనే ఔట్

>> 10.3 ఓవర్లలో 81 పరుగులు చేసిన టీమిండియా.

>> రన్ రేట్ 7.59గా ఉంది..

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now