Skill Development Case: చంద్రబాబు రిమాండ్‌ మరో 14 రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో (Skill Development case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది.

chandrababu (Photo-TDP-Twitter)

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో (Skill Development case) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది.

ఈ నేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను రెండు వారాల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించండి, ఏసీబీ కోర్టులో మెమో దాఖలు దాఖలు చేసిన సీఐడీ

మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement