YSR Rythu Bharosa: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం, వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం తొలి విడత నిధుల విడుదల చేసిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

YS Jagan (Photo-Video Grab)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఐదో ఏడాది.. తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం జగన్‌ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు.

జగన్ నాలుగేళ్ల పాలనపై మంత్రులు స్పందన ఇదిగో, నవరత్నాలతో రాష్ట్రంలో స్వర్ణ యుగం నడుస్తుందని తెలిపిన వైసీపీ నేతలు

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన.

నిర్మల్‌ హృదయ్‌ని సందర్శించిన జగన్-భారతి దంపతులు, హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ఐదో ఏడాది.. తొలి విడుత నిధుల్ని ఇప్పుడు విడుదల చేస్తున్నాం. 52,30,939 మంది రైతన్నల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది. కానీ, మేం మొదటి నుంచి రైతులకు అండగా ఉంటూ వస్తున్నాం. ప్రతీ రైతన్నకు రూ.61,500 సాయం(ఇవాళ జమ చేసేదాంతో కలిపి) అందించాం. గత నాలుగేళ్లుగా 22.70 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు.. రూ.1,965 కోట్లు నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేశాం.

మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రూ.12,500కి బదులు.. రూ. 13,500 రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ. 31 వేల కోట్లు జమ చేశాం. ప్రతీ ఏడాది రూ. 3,923 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తున్నాం. ఏ సీజన్‌లో అయిన పంట నష్ట జరిగితే.. అదే సీజన్‌లో నష్ట పరిహారం అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. విత్తనం నుంచి పంట కొనుగోలుదాకా రైతన్నలకు అండగా ఉన్నాం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ ఈ బిడ్డ పరిపాలన మొదలయ్యాక.. మంచి వానలు ఉన్నాయి. కరువుల్లేవ్‌.. వలసలు కూడా తగ్గిపోయాయి. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆర్‌బీకేల ద్వారా మీ బిడ్డ హయాంలోనే రైతులకు మేలు జరుగుతోంది. మీ బిడ్డ పాలనలో 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం. ఈ నాలుగేళ్లలో ధాన్య సేకరణపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ వ్యయం రూ. 77 వేల కోట్లకు చేరుతుంది. గతంలో గ్రామస్థాయిలో భూ వివాదాలు ఉండేవి. రైతన్నలకు భూమిపై సర్వహక్కులు ఎంతో ముఖ్యం. అందుకే కీలక అడుగు వేశాం. సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే జరుగుతోంది. సమగ్ర భూసర్వేతో భూవివాదాలను పరిష్కరిస్తున్నామన్నారు.

చుక్కల భూములపై సర్వ హక్కులూ రైతులకే ఇచ్చిన ప్రభుత్వం మనది. అక్వా రైతులకు మేలు చేసిన ప్రభుత్వం మనదే. అక్వా రైతులకు రూ. 2,967 కోట్లు సబ్సిడీ అందించాం. రైతులకు పగటి పూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. రూ.1,700 కోట్ల తో ఫీడర్లను బలపరుస్తున్నాం. రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులను మీ గ్రామానికే తీసుకొచ్చే అడుగుపడుతోందని సీఎం జగన్‌ ప్రకటించారాయన.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతో పాటు దేవదాయ, అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల సాగుదారులతోపాటు సెంటు కూడా భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున జమ చేస్తున్నారు.2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్లు సాయం అందించారు. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్ల మేర సాయం అందింది.

2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ.6944.50 కోట్లు చొప్పున సాయాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజాగా 2023–24కి సంబంధించి 52,30,939 మంది అర్హత పొందగా వీరికి తొలి విడతగా రూ.3923.22 కోట్ల మేర సాయం అందించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now