CM Jagan Meets PM Modi: ప్రత్యేక హోదాతో సహా ఇతర హామీలు అమలు చేయండి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇవే, ముగిసిన ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ (CM Jagan Meets PM Modi) అయ్యారు.
New Delhi, Feb 9: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ (CM Jagan Meets PM Modi) అయ్యారు.
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై (discusses state issues) సీఎం చర్చించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గంటకు పైగా సీఎం వైఎస్ జగన్ సమావేశం కొనసాగింది. అనంతరం పార్లమెంట్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో అరగంట పాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు.
ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని సీఎం జగన్ కోరారు.
అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. 2014 జూన్ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పాడతాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు.
కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని ఆంధ్ర సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సూచించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం విన్నవించారు.