Andhra Pradesh: డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తి చేయండి, గృహ నిర్మాణ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

YS Jagan (Photo-Twitter)

Tadepalli, July 6: తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. జగనన్న కాలనీల నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇళ్ల నిర్మాణం ప్రగతిపై అధికారులు వివరాలు అందించారు. ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ 2నుంచి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు, మొత్తం 2 లక్షల 94 వేల మ్యాచ్‌లు, ఐదు కేటగిరిలో పోటీలు

కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలి. విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు. డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలన్నారు.

కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలి. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు. పేదవాళ్ల కడుపు కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారు. పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన. గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి. దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలని సీఎం తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement