YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను వారి అకౌంట్లలో జమ చేసిన సీఎం జగన్

వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్‌ రైతు భరోసా అమలుచేస్తూ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.

YS-JAGAN

Tenali, Feb 28: వరుసగా నాలుగో ఏడాది కూడా వైఎస్సార్‌ రైతు భరోసా అమలుచేస్తూ జగన్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేశారు.

రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం విదితమే. వరు­సగా నాల్గో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం జగన్‌ నేడు జమ చేశారు.

తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..

ఇక 2022 డిసెంబర్‌లో మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్‌ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సి­డీని అందించారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement