AP COVID-19 Bulletin: కర్నూలు, గుంటూరులో పెరుగుతున్న కేసులు, ఏపీలో తాజాగా 75 కొత్త కేసులు, 20కి చేరిన మరణాల సంఖ్య, రాష్ట్రంలో 722కి చేరిన కోవిడ్-19 కేసులు సంఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా (Coronavirus Cases) బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్‌-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను (AP COVID-19 Bulletin) విడుదల చేసింది. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది.

Coronavirus Outbreak | Representational Image| (Photo Credits: IANS)

Amaravati, April 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా (Coronavirus Cases) బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్‌ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్‌-19 కేసులకు సంబంధించిన బులెటిన్‌ను (AP COVID-19 Bulletin) విడుదల చేసింది. కర్నూలు జిల్లా 174 కేసులతో టాప్‌లో ఉండగా.. 149 కేసులతో గుంటూరు తర్వాతి స్థానంలో ఉంది.  లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన, రాష్ట్రాలపై సీరియస్ అయిన హోంశాఖ

జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

Here's AP COVID-19 Bulletin

ఇండియాలో 17 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 543 మంది మృతి

గడిచిన 24 గంటల్లో 27 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గుంటూరులో 15, కృష్ణలో 10, విశాఖపట్నంలో ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక అనంతపురం, కృష్ణ, కర్నూలు జిల్లాల్లో కోవిడ్‌తో ఒక్కొక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20కి చేరింది.

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కేరళ సర్కారు, సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే సడలింపులు ఉపసంహరణ

కోవిడ్‌– 19 నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించింది. దీంతో ఏపీలో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 3775 మంది శాంపిళ్లకు పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,297 మందికి పరీక్షలు నిర్వహించి... దేశంలో వైద్యపరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ 2 లో నిలిచింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement