IPL Auction 2025 Live

New Ration Cards: కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఈ నెల 15 నుంచి మీ ఇంటికే రేషన్ కార్డు, పంపిణీ చేయనున్న గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు (Grama/ward Volunteers) లబ్ధిదారుల ఇళ్ల వద్దనే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

Andhra Pradesh Government prepared new ration cards (Photo-Twitter)

Amaravati, Febuary 10: జాతీయ ఆహార భద్రత చట్టం–2013 (National Food Security Act - 2013) పేరిట ఏపీ ప్రభుత్వం (AP GOVT) కొత్తగా జారీ చేయనున్న బియ్యం కార్డుల ముద్రణ (New Ration Cards) పూర్తయ్యింది. ప్రభుత్వం కొత్తగా ఇవ్వనున్న బియ్యం కార్డుల ముద్రణ పూర్తి అవ్వడంతో జగన్ సర్కారు (Jagan Govt) పంపినీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.

జూన్ 1 నుంచి వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ అమల్లోకి

ఈ నెల 15 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు (Grama/ward Volunteers) లబ్ధిదారుల ఇళ్ల వద్దనే కొత్త కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది.

ఒకే దేశం- ఒకే రోజున వేతనం

గతంలో సుమారు 1.47 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రేషన్‌ కార్డులను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వం పూర్తిగా కొత్త కార్డులివ్వనుంది. జాతీయ ఆహార భద్రత చట్టం–2013 పేరిట ఈ బియ్యం కార్డులను ముద్రించారు. కొత్త కార్డులో కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటోకు బదులు కార్డు ఎవరి పేరున మంజూరైందో వారి ఫొటోనే ఉంటుంది.

ఫాస్టాగ్స్ ఎలా పొందాలి? రీఛార్జ్ వివరాలు

కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల పేరిట వేర్వేరుగా ఐడీ నంబర్లు ఇచ్చారు. కార్డు ఏ రేషన్‌ డీలర్‌ పరిధిలోకి వస్తుందనే వివరాలు కూడా కార్డులో పొందుపరిచారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్‌ కార్డులో సభ్యుల వయస్సు మాత్రమే ఉండేది. కొత్త కార్డుల్లో పుట్టిన తేదీతో సహా ముద్రించారు.

కార్డుల్లో పేర్లు, ఇతర సమాచారం తప్పుల్లేకుండా ఉండేందుకు గ్రామ, వార్డు వలంటీర్‌ ద్వారా మరోమారు క్షేత్ర స్థాయిలో విచారించి వివరాలు సరైనవేనని లబ్ధిదారులు ఆమోదించాకే కార్డులను తయారు చేశారు. కార్డులో తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ వివరాలున్నాయి. సరుకులు అందకుంటే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ 1902 / 1967 / 18004250082 నంబర్లను కూడా కొత్త కార్డులో ముద్రించారు.