
Patna, January 21: రేషన్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’(One Nation, One Ration Card) పథకాన్ని జూన్ 1, 2020 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ (Union Minister Ram Vilas Paswan)సోమవారం ప్రకటించారు.
'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ స్కీంను జూన్ 1నుంచి దేశమంతా అమల్లోకి తీసుకువస్తాం. ఈ స్కీం కింద లబ్ధిదారుడు దేశమంతా ఒకేరేషన్ కార్డుతో ప్రయోజనాలు పొందగలడు' అని రామ్ విలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
అంతకుముందు ఈ సదుపాయాన్ని దేశంలోని 12 రాష్ట్రాల్లో నూతన సంవత్సరం సంధర్భంగా ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ సదుపాయం కింద, ఈ రాష్ట్రాల లబ్ధిదారులు వారు నివసిస్తున్న12 రాష్ట్రాలలో ఎక్కడైనా రేషన్ ను(COMMODITIES) పొందవచ్చని మంత్రి తెలిపారు.
Here"s ANI Tweet
Union Minister Ram Vilas Paswan: We will implement 'One Nation, One Ration Card' scheme by 1st June in the whole country. Under this scheme a beneficiary will be able to avail benefits across the country using the same ration card. (20.01.20) pic.twitter.com/pHzue6APJu
— ANI (@ANI) January 20, 2020
డిసెంబర్ 30, 2020 నాటికి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థ తప్పకుండా దేశం మొత్తం అమలులోకి వస్తుందని రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. జనవరి 1కంటే ముందు న్యూ ఇయర్‌లోపే ఈ సదుపాయాలన్నీ 12 రాష్ట్రాల్లో అమలవుతాయని ఆయన చెప్పారు.
ఈ సదుపాయం కింద 12 రాష్ట్రాల్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రేషన్ తీసుకోవచ్చని అన్నారు. కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆహారం, పౌర సరఫరాల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. డిసెంబరు 3నుంచి పాశ్వాన్ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి ప్రకటిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ సిస్టమ్‌ను 2020 జూన్ 30నాటికల్లా అమలుచేస్తామని హామీలు ఇస్తామనే అన్నారు.