Andhra Pradesh: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త, ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయనున్న జగన్ సర్కారు, కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు.

Andhra Pradesh CM YS Jagan Mohan Reddy. (Photo Credits: Twitter@AndhraPradeshCM)

Vjy, August 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది! కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసేందుకు ఐదేళ్ల సర్వీసు నిబంధనను సడలిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2కు ముందు నియమించబడి ఇప్పటి వరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు.

వీడియో ఇదిగో, పోలీస్ శాల్యూట్ చేస్తుండగా కింద పడిన మెడల్, స్వయంగా కిందకు వంగి దాన్ని తీసి మళ్లీ ప్రదానం చేసిన సీఎం జగన్

నిన్న స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇందుకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసి వారికి పండుగ కానుక ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌పై నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారు. హామీలో భాగంగా 2014, జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే రెగ్యులర్ చేయాలని గత కేబినెట్లో తీర్మానం చేశారు. దీంతో ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులకు ఈ ప్రయోజనం దక్కలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకావడంతో ప్రభుత్వం పునఃపరిశీలన చేసింది.

మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి

కాగా, విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్‌ సూచనలతో విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది. అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement