Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసిన ఏపీ హైకోర్టు, నిర్మాణానికి లైన్‌ క్లియర్‌

ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది.

AP High Court (Photo-Twitter)

VJY, Nov 4: ఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది.

ఏపీలో రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు, గుమ్మళ్ళదొడ్డి వద్ద బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్

ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్‌ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement